సత్య సాయిబాబా స్థితిపై ఆదికేశవులు నాయుడు సంచలన వ్యాఖ్యలు

సత్య సాయిబాబాను ఆరు నెలలుగా సత్యజిత్ దర్శంచకుండా చేశారని ఆయన ఆరోపించారు. పూర్తి వాస్తవాలు తెలియకుండా మాట్లాడితే బాగుండదని ఇంత కాలం తాను మౌనంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. వాస్తవాలు ప్రభుత్వానికి తెలిసినా చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. మంత్రి గీతా రెడ్డికి వాస్తవాలు తెలుసునని, గీతా రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. సత్య సాయిబాబా ఆరోగ్యం బాగా లేకున్నా సత్యజిత్ చికిత్స చేయించలేదని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి, ట్రస్టుకు వాస్తవాలు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. రత్నాకర్ లాంటి వ్యక్తులు సత్య సాయిబాబా స్థితిపై నోరు విప్పాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications