సబితారెడ్డి, జైపాల్‌రెడ్డిపై కోడిగుడ్ల దాడి: మంత్రుల సభలో లేచిన కుర్చీలు

గ్రామంలో సభ జరుగుతుండగా ఈ దాడి జరిగింది. జైపాల్ రెడ్డిని కదలనివ్వం అని తెలంగాణ విద్యార్థి సంఘాల నేతలు పట్టుపట్టారు. ఎవరి అనుమతి తీసుకొని గ్రామంలోకి వచ్చారని వారిని నిలదీశారు. తెలంగాణవాదులతోపాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మంత్రులను నిలదీయటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ వాదుల తెలంగాణ డిమాండుకు తోడు ఏడాది తర్వాత తమ వద్దకు రావడంపై కాంగ్రెసు నేతలు ప్రశ్నించారు. అయితే కాంగ్రెసులో రెండు వర్గాలు ఉండటం వల్ల ఓ వర్గానికి చెందిన వారు మంత్రులను నిలదీసినట్లుగా తెలుస్తోంది.
దీంతో ఇరువర్గాల మధ్య వివాదం జరిగింది. ఇరువర్గాలు కుర్చీలు ఒకరిపై మరొకరు విసురుకున్నారు. సుమారు అయిదు వందల మంది పోలీసుల భద్రతలో ఉన్న మంత్రులు వారిని వారించడానికి ప్రయత్నాలు చేశారు. పోలీసులు, మంత్రుల జోక్యంతో చివరకు గొడవ సద్దుమణిగింది.