కడపలో చిరు పర్యటన ఖరారు!, ఆ తర్వాత డిఎస్, గులాం నబీ ఆజాద్

Chiranjeevi
హైదరాబాద్: కడప ఉప ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ప్రచారం తేది దాదాపుగా ఖరారు అయినట్లుగా కనిపిస్తోంది. కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభ ఎన్నికల్లో ధీటైన అభ్యర్థి అయిన జగన్‌ను ఎదుర్కొనేందుకు చిరంజీవిని రంగంలోకి దించాలని కాంగ్రెసు అధిష్టానం యోచిస్తున్న విషయం తెలిసింది. ఇందుకు చిరంజీవి కూడా తలూపారు. ఇప్పటికే చిరంజీవి తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక ఎన్నికలలో ప్రచారం చేసి వచ్చారు. ఇప్పుడు కడప ఉప ఎన్నికలలో చిరంజీవిచే ప్రచారం చేయించి కాంగ్రెసును మరింత ప్రభావవంతంగా చేయాలని యోచిస్తోంది.

చిరు పర్యటన దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఈ నెల 28వ తేది నుండి 30 తేది వరకు చిరంజీవి కడప జిల్లాలో పర్యటిస్తారు. అయితే చిరంజీవి ప్రభావం కాంగ్రెసుకు ఏ మేర ఉపయోగపడుతుందో ఎన్నికల తర్వాతే తెలుస్తుంది. ఇక చిరు పర్యటన తర్వాత ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్, ఆంధ్ర ప్రదేశ్ వ్యవహారా ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్ కూడా పర్యటించనున్నారు. వారు మే 1, 2వ తేదీల్లో పర్యటించే అవకాశం ఉంది. మొత్తానికి జగన్‌ను ఎదుర్కొనడానికి కాంగ్రెసు పార్టీ ప్రయాస పడుతుందని చెప్పుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+