త్వరలో మార్కెట్‌లోకి ఏడు వేలకే ఫ్లయ్ కంపెనీ ఆండ్రాయిడ్ ఫోన్స్

ఇండియాలో ఉన్నటువంటి మొబైల్ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకోని చాలా కంపెనీలు తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. లండన్‌కి సంబంధించినటువంటి కంపెనీ అయినటువంటి ప్లయ్ త్వరలో ఇండియన్ మొబైల్ మార్కెట్‌లో నాలుగు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్స్‌ని విడుదల చేయనుంది. ఇక ఈ ఫోన్స్ ఖరీదు విషయానికి వస్తే రూ 7000 నుండి రూ 10000లోపే ఉండవచ్చునని అంటున్నారు. తక్కవ ఖరీదు కదా ఇందులో ఆప్షన్స్ ఏమి ఉండవు అనుకుంటే పోరపాటు పడినట్లే. ఫ్లయ్ కంపెనీ ముందుగా చెప్పినట్లు ఈ నాలుగు ఫోన్స్ లలో 5మోగా పిక్సల్ కెమెరాతోపాటు, ఆండ్రాయిడ్ 2.2 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.
ఇకపోతే ప్రస్తుతం ఇండియాలో అంతా 3జి మయం. ఈ సంవత్సరం చివరి కల్లా 3జి ఇంకా జనాభాలోకి చోచ్చుకుపోతుంది. దీనిని దృష్టిలో పెట్టుకోవడం వల్లనే ఇప్పడు ప్లయ్ కంపెనీ నాలుగు మొబైల్స్‌ని మార్కెట్ లోకి విడుదల చేస్తుంది. దీనిని బట్టి చూస్తుంటే త్వరలో మన దేశంలో తక్కువ ధరలోనే ఆండ్రాయిడ్ ఫోన్స్ దర్శనమివ్వనున్నాయన్నమాట.