వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.3 లక్షలు ఇవ్వనందుకు మృదుల హత్య: వీడిన మర్డర్ మిస్టరీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
విశాఖపట్నం: ఇటీవల విశాఖపట్నంలో హత్యకు గురి అయిన ఇంటర్మీడియెట్ విద్యార్థిని మృదుల కేసు చిక్కుముడిని విశాఖ పోలీసులు విప్పారు. మృదుల తల్లిదండ్రులు తాను అడిగిన 3 లక్షల రూపాయలు ఇవ్వనందుకే హత్య చేసినట్టుగా ప్రధాన నిందితుడు శివ పోలీసులు ముందు గురువారం స్పష్టం చేశారు. మృదులతోనే కాకుండా ఆమె కుటుంబంతో కూడా తనకు ముందే పరిచయం ఉందని చెప్పాడు. మృదుల హత్య కేసులో ప్రధాన నిందితుడు అయిన శివకు మృదుల కుటుంబంతో అంతకుముందే పరిచయం ఉంది.

అయితే శివ తన అప్పును తీర్చడం కోసం హత్యకు మూడు రోజుల ముందు మృదుల తల్లిదండ్రులను సందర్భంలో రూ.3 లక్షల రూపాయలు కావాలని అడిగాడు. అయితే వారు అందుకు నిరాకరించారు. దీంతో ఆగ్రహం చెందిన శివ మరో ముగ్గురు కిరాయి రౌడీలతో కలిసి మృదుల ఇంటికి దొంగతానికి వచ్చాడు. అయితే ఇంట్లో మృదుల ఒక్కతే ఉంది. ఆ సమయంలో ఆమెపై క్లోరోఫాం చల్లి కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఆమెను హత్య చేసి ఇంట్లో ఏమైనా డబ్బులు ఉంటాయో అంతా వెతికాడు. మృదుల తండ్రి పెట్రోలు బంకు యజమాని. పెట్రోలు బంకులో పని చేస్తున్న వ్యక్తి వస్తున్నట్టు గమనించిన శివ ఆ ముగ్గురితో కలిసి పారిపోయాడు.

ఈ హత్య కేసును విశాఖపట్నం పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకొని ఛేదించారు. ఇప్పటికే నగరంలో వరుసగా అమ్మాయిలపై జరుగుతున్న దాడుల సమయంలో మృదుల హత్య జరగడంతో వారి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. దీంతో విశాఖ సిపి ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకొని ఈ కేసు మిస్టరీని ఛేదించడం కోసం నాలుగు టీంలను రంగంలకి దింపారు.

English summary
Shiva, main accused in Vishaka's Mrudula murder case, was told to Vishaka police that he was killed Mrudula for 3 lack rupees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X