వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గమ్యం సినిమా సంగీత దర్శకుడు అనిల్ ఆకాల మరణం

By Pratap
|
Google Oneindia TeluguNews

Anil Music director
హైదరాబాద్‌: వర్థమాన సంగీత దర్శకుడు అనిల్‌ గుండెపోటుతో హైదరాబాదులో మృతిచెందారు. ఆయన వయసు 33 సంవత్సరాలు. గమ్యం, నిన్న నేడు రేపు, ఎల్బీడబ్ల్యు వంటి చిత్రాలకు ఆయన సంగీతం సమకూర్చారు. గురువారం ఉదయం ఆయన కన్ను మూశారు. ఇఎస్ మూర్తితో కలిసి ఆయన గమ్యం సినిమాకు సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో అల్లరి నరేష్, శర్వానంద్, కమిలిని ముఖర్జీ నటించారు. రాధాకృష్ణ జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించారు. ఆయన పాట ఎంతవరకు ఎందు కొరకు అనే పాట ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది.

నిఖిల్, శ్వేతబసు చిత్రం కళావర్ కింగ్‌కు భిన్నమైన ట్యూన్స్ అందించారు. బెల్జియం మిషెల్లే మ్యూజిక్ కంపెనీలో ఆయన తొలుత పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాదు వచ్చారు. మిక్కీ జె మేయర్‌తో కలిసి సొంత ఆల్బం విడుదల చేశారు. ఆస్పత్రికి తరలించే లోగానే ఆయన మరణించారు. ఆయన మృతి సినీ రంగానికి లోటే.

English summary
Music Director Anil dead - Gamyam music director Anil died today morning in Hyderabad. Anil died due to a sudden cardiac arrest, which has struck him in no time. This is a big loss to Telugu cinema industry as a promising music director left us.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X