జగన్ పార్టీపై కాంగ్రెసు ఫిర్యాదు, వైయస్ బొమ్మ మాదేనని వినతి

YS Jagan
హైదరాబాద్/ కడప‌: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. వైఎస్‌ఆర్‌ ఫోటోను వాడుకునే హక్కు కాంగ్రెస్‌కే ఉందని తెలియజేసింది. ఇతరులు ఆ ఫోటోను వాడకోకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. వైయస్ జగన్ వైయస్ రాజశేఖర రెడ్డి చిత్రాన్ని ప్రధానంగా వాడుకుంటున్న విషయం తెలిసిందే. వైయస్ పథకాల కీర్తి తమ పార్టీకే దక్కుతుందని కాంగ్రెసు ఉపాధ్యక్షుడు అన్నారు.

కడప ఉపఎన్నికలపై వైఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రతిష్ట ఆధారపడి ఉందని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. వైఎస్‌ ఎప్పటికీ కాంగ్రెస్‌ వారసుడేనని, జగన్‌కేవలం వైఎస్‌ ఆస్తికి మాత్రమే వారసుడని ఆయన శనివారం కడపలో అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ద్వారా వేలకోట్లు సంపాదించిన జగన్‌ ఆ పార్టీకే వెన్నుపోటు పొడిచారని అన్నారు. ప్రజలను విస్మరించి బెంగుళూరులో ఉండే వ్యక్తిని జనం క్షమించరని అన్నారు. ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తులకే ఓటేయాలని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+