Viswanath & Sons First Review: ఆ ట్విస్టుతో సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది..!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలకు తమిళంలో ఎంత క్రేజ్ ఉందో తెలుగులో కూడా అంతే క్రేజ్ ఉంది. సూర్య నటించిన గజిని సినిమా నుంచి ఆయనకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇటీవల 'కరుప్పు' మూవీ.. తెలుగులో 'వీరభద్రుడు' తో సూర్య బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ మూవీ తమిళంతోపాటు తెలుగులోనూ మంచి వసూల్లు సాధించింది. అంతకుముందు వరుస ప్లాఫ్ లతో ఉన్న సూర్య కరుప్పు మూవీతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చినట్లు అయింది. ఇక ఈ మూవీ తర్వాత సూర్య నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ ఆగస్టు 14 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమైంది. ఇటీవల రిలీజైన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ట్రైలర్, పాటలు రిలీజ్ కావడంతో మూవీపై ఇప్పటికే పాజిటివ్ బజ్ ఏర్పడింది. హిట్ టాక్ వచ్చినా సూర్య ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్ చేసే పనిలో ఉన్నారు. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత నాగవంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీలో సూర్య సరసన మలయాళ బ్యూటీ మమిత బైజు కథానాయకిగా నటిస్తోంది. ఈ మూవీ ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన డిఫరెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ మూవీ ప్రివ్యూ షో ను తాజాగా లండన్ లో కొంత మంది ముఖ్యమైన వాళ్లకు వేసి చూపించినట్లు సమాచారం. అత్యధిక శాతం ఆ ప్రివ్యూ షో లో అన్ని ప్రాంతాలకు చెందిన బయ్యర్స్ ఉన్నారని తెలుస్తోంది.

వారి నుంచి వస్తున్న సమాచారం బట్టి.. 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ ఆరంభంలో కాస్త స్లో గానే స్క్రీన్ ప్లే సాగుతుంది.. కథలో దమ్ము ఉండడం తో పాటు , గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా నడుస్తుంది. దాంతో ఫస్టాఫ్ ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది. ఇక ఇంటర్వెల్ కు వచ్చే ట్విస్ట్ తో చాలా కాలం తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ స్టోరీని చూసిన ఫీలింగ్ కలుగుతుందని టాక్ వినిపిస్తోంది. అలాగే సెకండాఫ్ స్టార్టింగ్ నుండే మంచి డ్రామాతో ముందుకు నడిపించారని.. ముఖ్యంగా హీరో సూర్య, మమిత బైజు మధ్య వచ్చే సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయని మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీ ఫుల్ రివ్యూ కోసం ఆగస్టు 14 వరకు ఆగాల్సిందే.



Click it and Unblock the Notifications