జగన్, కిరణ్ మధ్యే పోటీ: ఉప ఎన్నికల తర్వాత సంక్షోభం తప్పదా?

కాగా, ఉప ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సంక్షోభంలో పడుతుందని వైయస్ జగన్ వర్గం ప్రచారం సాగిస్తోంది. నలుగురు శానససభ్యులపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెసు పార్టీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు విజ్ఝప్తి చేయడంపై జగన్ వర్గం నాయకులు మండిపడుతున్నారు. కాంగ్రెసు ప్రభుత్వానికి ఆగస్టు సంక్షోభం తప్పదని శాసనసభ్యురాలు కొండా సురేఖ ఇటీవల అన్నారు. కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి తాజాగా అదే మాట అన్నారు. ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సంక్షోభంలో పడక తప్పదని ఆయన శనివారం ఓ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. ఉప ఎన్నికల తర్వాత జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేస్తారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అంటున్నారు. దీన్నిబట్టి ఉప ఎన్నికల తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు వైయస్సార్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందనే భావన కలుగుతోంది.
కడప లోకసభ స్థానంలో వైయస్ జగన్‌ను ఓడించడానికి కాంగ్రెసు పార్టీ శాయశక్తులా కృషి చేస్తోంది. కడపలో జగన్‌ను ఓడించడానికి 150 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు శనివారం విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలపై 9300 బైండోవర్ కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. కడపలో జగన్‌ను ఓడించడానికి కాంగ్రెసు పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు సాగిస్తోందని చెప్పవచ్చు. జగన్‌ను ఓడించలేకపోయినా మెజారిటీ తగ్గించాలనేది కాంగ్రెసు వ్యూహంగా కనిపిస్తోంది. దానికి తోడు, తెలుగుదేశం పార్టీని మూడో స్థానానికి నెట్టి, కనీసం రెండో స్థానంలోనైనా నిలువాలని అనుకుంటోంది.












Click it and Unblock the Notifications