హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవికి ఝలక్, విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఇసికి శోభానాగిరెడ్డి, కాటసాని లేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్‌: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు శోభా నాగిరెడ్డి, కాటసాని రాంరెడ్డి పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి మెగా షాక్ ఇచ్చారు. తమపై అనర్హత వేటు వేయించాలని చిరంజీవి ఆలోచన చేస్తున్న స్థితిలో వారు కేంద్ర ఎన్నికల సంఘానికి (సిఇసి)కి లేఖ రాశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయాలనే నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వారు సిఇసికి లేఖ రాశారు. కాంగ్రెసులో విలీనం చేస్తూ చిరంజీవి ఇప్పటికే సిఇసికి లేఖ అందజేశారు. ఈ స్థితిలో శోభానాగిరెడ్డి, కాటసాని రాంరెడ్డి సిఇసికి లేఖ రాశారు.

పార్టీని కాంగ్రెసులో విలీనం చేయాలనే నిర్ణయం నేపథ్యంలో తమపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందా, లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి వారు న్యాయవాదులను సంప్రదిస్తున్నారు. ఆ విషయంపై శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో మాట్లడడానికి వారు తమ న్యాయవాదులను పంపించారు. ఇదే సమయంలో, విలీనాన్ని దయ్యబడుతూ పార్టీ నాయకురాలు శోభారాణి చిరంజీవికి బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే.

English summary
Prajarajyam party MLA, belonging to YS Jagan camp, Shobha Nagi Reddy and Katasani ram Reddy have written a letter to CEC objecting merger of party in Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X