హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్య సాయి ట్రస్టుపై అంధకారంలో ప్రభుత్వం, రికార్డులు కూడా లేవు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
హైదరాబాద్: పుట్టపర్తి సత్య సాయి సెంట్రల్ ట్రస్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అంధకారంలో ఉన్నట్లు తెలుస్తోంది. ట్రస్టుకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఏ విధమైన రికార్డులు లేవని వార్తలు వస్తున్నాయి. సత్య సాయి బాబా ఆరోగ్యం క్షీణించి, ఆయన కోలుకోవడానికి భక్తులు పూజలు నిర్వహిస్తున్న తరుణంలో వెనక్కి చూస్తే ప్రభుత్వం వద్ద ఏ విధమైన వివరాలు లేవు. సత్య సాయి ట్రస్టు 1972 సెప్టెంబర్ 2వ తేదీన అనంతపురం దేవాదాయ కమిషనర్ వద్ద రిజిష్టర్ అయింది. అయితే, ప్రభుత్వం వద్ద ట్రస్టు డీడ్ ఒక్కటి కూడా లేదు.

ట్రస్టు కార్యకలాపాలను కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఏ విధమైన రికార్డులు లేవని దేవాదాయ శాఖ అధికారులు అంటున్నట్లు వార్తలు వచ్చాయి. సత్య సాయి చైర్మన్‌గా ఉన్న ట్రస్టు 1980లో దేవాదాయ శాఖకు నివేదికలను సమర్పించే చట్టబద్దమైన నిబంధనను తమకు మినహాయించాలని కోరినట్లు తెలిస్తోంది. దానికి అప్పటి కాంగ్రెసు ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ మినహాయింపుతో ట్రస్టు విదేశీ విరాళాలకు సంబంధించిన వివరాలను మాత్రమే కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ప్రతి ఏడాదీ సమర్పిస్తోంది.

ట్రస్టు ఏర్పడినప్పటి నుంచి వంద శాతం పన్ను రాయితీని అనుభవిస్తూ వస్తోంది. సెంట్రల్ ట్రస్టుతో పాటు సత్య సాయి బాబా వివిధ ట్రస్టులను ఏర్పాటు చేశారు. కర్ణాటక సత్యసాయి హెల్త్ ట్రస్టు, శ్రీసత్య సాయి ట్రస్టు, ముంబై శ్రీ సత్యసాయి బుక్స్ అండ్ పబ్లికేషన్ ట్రస్టు, అనంతపురం శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్, శ్రీ సత్య సాయి మెడికల్ ట్రస్టు, శ్రీ సత్య సాయి ఫౌండేషన్ ఫర్ యూనివర్సల్ పీస్ వంటి ట్రస్టులను ఆయన ఏర్పాటు చేశారు.

English summary
Under pressure from the devotees of Sri Sathya Saibaba to come to their aid when their god' is in a critical condition, the state government has realized that it does not have any records pertaining to the Sathya Sai Central Trust.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X