సత్య సాయి ట్రస్టు మీడియా సమావేశం వాయిదా ఎందుకు పడింది?

ట్రస్టు వ్యవహారాలపై ట్రస్టు సభ్యులు ఒకటి రెండు ప్రకటనలు విడుదల చేయడం మినహా విమర్సలకు, ఆరోపణలకు మీడియా ముందుకు వచ్చి వారు సమాధానం ఇవ్వలేదు. తమను మీడియా ముందుకు వెళ్లాలని గానీ వద్దని గానీ సత్య సాయిబాబా తమకు ఎప్పుడూ చెప్పలేదని, అందువల్ల మీడియా ముందుకు వెళ్లాలంటే తాము మరోసారి చర్చించుకోవాల్సి ఉంటుందని ట్రస్టు సభ్యులు చెప్పారు. శనివారం సాయంత్రం సమావేశమై ఆ విషయంపై నిర్ణయం తీసుకుని ఆదివారంనాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసే విషయంపై చెప్తామని వారన్నారు. దీంతో శనివారంనాటి మీడియా సమావేశం వాయిదా పడింది.
కాగా, సత్యసాయిబాబా ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉందని మంత్రి గీతారెడ్డి చెప్పారు. ప్రభుత్వం, వైద్యుల మధ్య సమన్వయం కోసమే ఇక్కడికి వచ్చానని ఆమె అన్నారు. బాబా గుండె, కాలేయం, మూత్రపిండాలు చికిత్సకు స్వల్పంగా స్పందిస్తున్నాయని డా.రవిరాజ్ పేర్కొన్నారు. నాడీ వ్యవస్థ పనితీరు అవసరమైన మేర లేదని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications