సత్య సాయి బాబా అంతిమ సంస్కారాల తర్వాత ట్రస్టు కీలక భేటీ

Sathya Sai Baba
పుట్టపర్తి: సత్య సాయి బాబా అంతిమ సంస్కారాల తర్వాత ట్రస్టు కీలక భేటీ జరగనుంది. బుధవారం ఉదయం సత్య సాయిబాబా అంత్యక్రియలు జరుగుతాయి. ఆ తర్వాత సత్య సాయి సెంట్రల్ ట్రస్టు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సత్య సాయిబాబా మృతితో దాదాపు 40 వేల కోట్ల ఆధ్యాత్మిక సంస్థ ఆస్తుల వ్యవహారంపై, కార్యకలాపాలపై అయోమయం నెలకొంది. ఆధ్యాత్మిక కేంద్రం కార్యకలాపాలను ఎలా కొనసాగించాలి, ఎవరు నేతృత్వం వహించాలి అనే విషయాలపై ట్రస్టు చర్చిస్తుంది. సత్య సాయిబాబా తన వారసుడ్ని ప్రకటించలేదని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఎవరు నేతృత్వం వహించాలనే విషయంపై అయోమయం నెలకొంది.

బుధవారం జరిగే సమావేశంలో ట్రస్టు సభ్యులతో పాటు సత్య సాయిబాబా కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారు. ఇరు పక్షాల మధ్య విభేదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో బుధవారం జరిగే సమావేశానికి ప్రాధాన్యం చేకూరింది. సత్యసాయి బాబా వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్‌ను ట్రస్టులోకి తీసుకోవాలా, వద్దా అనే విషయంపై కూడా సమావేశంలో చర్చ జరుగుతుంది. ట్రస్టులో సత్యజిత్‌కు కీలక బాధ్యతలు లభిస్తాయని బాబా నిరుడు ప్రకటించినట్లు చెబుతున్నారు.

బాబా ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి సత్యజిత్ పట్ల కొంత మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రస్టు కార్యదర్శి చక్రవర్తికి చెక్‌లపై సంతకాలు పెట్టే హక్కు ఉంది. అయితే, సత్య సాయిబాబా జీవించి ఉన్నంత వరకు ఆయన ఆ అధికారాన్ని వినియోగించుకోలేదు. సత్య సాయిబాబా సోదరుడి కుమారుడు రత్నాకర్ ట్రస్టు సభ్యుడిగా ఉన్నారు. ఆయన పాత్ర భవిష్యత్తులో ఎలా ఉంటుందనేది కూడా తేలే అవకాశాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+