వైయస్ వివేకానంద రెడ్డిపై వేటు వేయండి: జూపూడి ప్రభాకర రావు
State
oi-Pratapreddy
By Pratap
|
కడప: కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న పులివెందుల అభ్యర్థి వైఎస్ వివేకానంద రెడ్డిపై వేటు వేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేత జూపుడి ప్రభాకర్‌రావు అన్నారు. వైయస్ వివేకానంద రెడ్డి వైయస్సార్ పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని ఆయన అన్నారు. వేటు వేయాల్సింది నలుగురు ఎమ్యెల్యేలపైన కాదని ఆయన స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో మంత్రులు యధేచ్చగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన అరోపించారు. ఈ మేరకు ఆయనతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రతినిధులు బుధవారం కాంగ్రెసు ప్రభుత్వంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
కడప నియోజకవర్గంలో మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అంటూ వారిని వెనక్కి పిలిపించాలని వారు ఇసిని కోరారు. వైయస్ జగన్ కడప లోకసభ స్థానం నుంచి మూడు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారని జూపూడి ప్రభాకర రావు దీమా వ్యక్తం చేశారు. కడప కాంగ్రెసు పార్టీ అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫొటో పెట్టుకోకుండా వైయస్ రాజశేఖర రెడ్డి ఫొటో పెట్టుకుని ప్రచారం చేస్తున్నారని, అందుకు కాంగ్రెసు డిఎల్ రవీంద్రా రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.