పుట్టపర్తిలో పట్ట పగలే చంద్రుడి దర్శనం, సత్య సాయి మహా సమాధి వేళ

బాబా సోదరుడు జానకీ రామయ్య కుమారుడు రత్నాకర్ వేద క్రియ నిర్వహించారు. త్రివేణి సంగమ నదీ జలాలతో అభిషేకం చేయించారు. కుల్వంత్ హాలులో బాబా మహా సమాధి అయ్యారు. మహా సమాధి సందర్భంగా 8 మంది మత పెద్దలు ప్రార్థనలు చేశారు. సప్త మృత్తికలతో బాబా దేహానికి స్నానం ఆచరింపజేశారు. అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వంటి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మహా సమాధి దర్శనానికి ప్రజలను ఈ నెల 29వ తేదీ వరకు అనుమతిస్తారు.












Click it and Unblock the Notifications