సత్య సాయి బాబా వీలునామా రాయలేదు, దాని ప్రసక్తి రాదు: శ్రీనివాసన్

తాను ట్రస్టు సభ్యుడిని కానని కేవలం ట్రస్టుకు కార్యదర్శిని మాత్రమేనని చక్రవర్తి గురువారం జరిగిన విలేకరుల ప్రతినిధుల సమావేశంలో స్పష్టం చేశారు. షిర్డీ తరహాలో అఖండ జ్యోతిని ఏర్పాటు చేసే విషయంతో పాటు బాబా సమాధిని దర్శించుకునే విజ్ఞప్తులను పరిశీలిస్తామని బాబా సోదరుడి తనయుడు రత్నాకర్ చెప్పారు. ఇప్పటి వరకు బాబాకే చెక్ పవర్ ఉందని ఇకముందు చెక్ పవర్ ఎవరికి ఉండాలో సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చెక్ పవర్ ఇద్దరికి ఉండాలని తాను సూచిస్తానని రత్నాకర్ చెప్పారు. హైందవ సాంప్రదాయం ప్రకారం బాబాకు అంత్యక్రియలు పెద్ద కొడుకు చేయవలసి ఉన్నప్పుటికి బాబా ఆజ్ఞ మేరకే తాను చేసినట్టుగా చెప్పారు.












Click it and Unblock the Notifications