హెచ్చరికలను ఖాతరు చేయని పైలట్లు, నాలుగో రోజుకు సమ్మె

సిఎండి అరవింద్ జాదవ్‌ను తొలగించాలనే తమ డిమాండ్ నుంచి పైలట్లు వెనక్కి తగ్గడం లేదు. సిఎండి తప్పుకోవాల్సిందేనని, అరెస్టులకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని, మొత్తం 31 వేల మంది ఉద్యోగులు కూడా అరెస్టు అవుతారని ఐసిపిఎ ప్రధాన కార్యదర్శి రిషబ్ కపూర్ అన్నారు. హెచ్చరికలకు దిగి రాకపోవడంతో మరో 80 నుంచి 100 మంది పైలట్లపై వేటు పడవచ్చునని భావిస్తున్నారు. సోమవారం వరకు ప్రతిష్టంభన కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. శుక్రవారం 320 విమానాలు నడవాల్సి ఉండగా 30 విమానాలు మాత్రమే నడిచాయి.












Click it and Unblock the Notifications