మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై దాడి, ఆస్పత్రిలో చేరిక

కత్తులతో దాడి చేసినప్పుడు కాల్పులు కూడా జరిగాయి. దుండగులు కాల్పులు జరిపారా, అక్బరుద్దీన్ జరిపారా, అక్బరుద్దీన్ గన్‌మెన్ కాల్పులు జరిపారా అనేది తెలియడం లేదు. అయితే, అక్బరుద్దీన్ శరీరంలో రెండు బుల్లెట్లు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే దీన్ని వైద్యులు ధ్రువీకరించడం లేదు. శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయి. తమ శానససభ్యుడిపై దాడి జరిగిందని తెలియడంతో మజ్లీస్ కార్యకర్తలు పెద్ద యెత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. దాడి చేసినవారు పరారీలో ఉన్నారు.
చాంద్రాయణగుట్టలోని బార్కాస్‌లో దాడి జరిగింది. మహ్మద్ పహిల్వాన్, అతని అనుచరులు ఈ దాడికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బార్కాస్‌లోని ఓ భూవివాదమే ఈ దాడికి కారణమని అనుమానిస్తున్నారు. మహ్మద్ పహిల్వాన్ గత ఎన్నికల్లో ఎంబిటి తరఫున శాసనసభ్యుడిగా పోటీ చేశాడు. అక్బరుద్దీన్ ఓవైసీ తండ్రి సల్లావుద్దీన్ ఓవైసీతో విభేదించి అమానుల్లా ఖాన్ ఎంబిటిని ఏర్పాటు చేశారు. హైదరాబాదు పాతబస్తీలో మజ్లీస్‌దే ఆధిపత్యం. సల్లావుద్దీన్ ఓవైసీ ఉన్నంత కాలం మజ్లీస్‌కు ఎదురు లేకుండా పోయింది.












Click it and Unblock the Notifications