ఆల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ స్థావరాన్ని ఎలా కనిపెట్టారు?

ఆ భవంతిని నిఘా విభాగం అధికారులు ఆగస్టులో కనిపెట్టినట్లు సమాచారం. ఆల్ ఖైదా కొరియర్‌ను వెంబడిస్తూ ఆ భవనాన్ని పట్టుకున్నారు. ఆ కొరియర్ కోసం సిఐఎ ఏళ్ల తరబడిగా గాలిస్తోంది. అతను ఒసామా బిన్ లాడెన్‌కు అత్యంత విశ్వాసపాత్రుడు, ఆయనతోనే ఉండేవాడు. భవనం ఆవరణ చుట్టూ 18 అడుగుల ఎత్తు గోడ ఉంది. రెండు సెక్యూరిటీ గేట్లు మాత్రమే ఉన్నాయి. మూడో అంతస్థు టెర్రాస్‌ను ఏడు అడుగుల గోడతో మూసేశారు. లక్షలాది రూపాయల ఖరీదు చేసే ఆ ఆవరణను ఐదేళ్ల క్రితం నిర్మించారని, ఓ ముఖ్యమైన ఉగ్రవాది కోసమే అ పని చేశారని నిఘా అధికారులు అనుమానించారు.
ఆ ఆవరణలోని భవనంలో నివసిస్తున్నది ఎవరనే విషయంపై సిఐఎ పలు మార్లు తనను ప్రశ్నించుకుంది. ఆరా తీసింది. అక్కడ ఉన్నది బిన్ లాడెన్ అని నిర్ధారించుకున్న తర్వాతనే దాడికి దిగింది. ఫిబ్రవరిలో ఆ విషయం తెలుసుకున్న తర్వాత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రెడున్నర నెలల పాటు సీనియర్ పాలనాధికారులతో విస్తృతంగా చర్చలు జరిపారు. జాతీయ భద్రతా మండలితో ఐదు సార్లు సమావేశమయ్యారు.
లాడెన్‌ను హతమార్చడానికి ఏప్రిల్ 29వ తేదీన పచ్చ జెండా ఊపారని చెబుతున్నారు. సిఐఎ డైరెక్టర్ లియోన్ పెనెట్టా నేతృత్వంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. పెనెట్టా కాన్ఫరెన్స్ రూం కమాండ్ సెంటర్‌గా మారిపోయింది. దాడి సందర్భంగా లాడెన్ ప్రతిఘటించాడని అమెరికా అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications