తెరాస అధినేత కె. చంద్రశేఖర రావుతో టిడిపి నేత నాగం జనార్దన్ రెడ్డి దోస్తీ?

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి కంకణం కట్టుకున్న కెసిఆర్‌పై ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కారాలు మిరియాలు నూరుతున్నారు. తమ పార్టీని నిర్మూలించడానికి పూనుకున్న కెసిఆర్‌పై ఎదురుదాడికి దిగాలని ఆయన పదే పదే పార్టీ తెలంగాణ నాయకులకు సూచిస్తున్నారు. ఈ స్థితిలో నాగం జనార్దన్ రెడ్డి ప్రకటన చంద్రబాబుకు పుండు మీద కారం చల్లినట్లు ఉంటుందనడంలో సందేహం లేదు.
నాగం జనార్దన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్కో అడుగే ముందుకు వేస్తున్నారనే విషయం కూడా ఆ మాటల ద్వారా వెల్లడవుతోంది. కెసిఆర్ తెలంగాణావాదులపై విరుచుకుపడడం మానుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ కోసం పార్టీ జెండాలను పక్కన పెట్టాలని, తెలంగాణ ఎజెండాతో ముందుకు సాగాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications