టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్‌పై విజయవాడలో పోలీసు కేసు నమోదు!

K Chandrasekhar Rao
విజయవాడ: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై విజయవాడ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. ఇటీవల మహబూబ్‌నగర్‌లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అంటూ కెసిఆర్ చేపట్టిన చండీయాగం చివరి రోజు ఆంధ్ర బ్రాహ్మణులపై ఆయన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కెసిఆర్ ఆంధ్రా బ్రాహ్మణులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని, ఆయనపై కేసు నమోదు చేయాలని విజయవాడకు చెందిన గోవిందరాజులు శ్రీనివాస్ అనే వ్యక్తి 1వ అదనపు జ్యూడిషియల్ కోర్టును ఆశ్రయించారు. గోవిందరాజులు తరపున సుబ్బారావు అనే న్యాయవాది వాదించారు.

వాదనలు విన్న కోర్టు కెసిఆర్‌పై కేసు నమోదు చేయాలని సత్యనారాయణపురం పోలీసులను అదేశించింది. కేసిఆర్‌పై భయందోళన కల్పించడం, బెదిరింపు గురిచేయడం ఆరోపణలపై 153, 153ఏ, 153బి, 500, 506 సెక్షన్లపై కేసు నమోదు చేశారు. కాగా గత ఏప్రిల్ 16న చండీయాగం చివరి రోజు తెలంగాణ బ్రాహ్మణులు నిష్టగా ఉంటారని, ఆంధ్రా బ్రాహ్మణులు ఆర్బాటాలకు పోతారని కేసిఆర్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హైదరాబాదులో ఇందిరాపార్కు వద్ద జరిగిన బ్రాహ్మణుల సమాఖ్యలో తెలంగాణ, ఆంధ్ర బ్రాహ్మణుల మధ్య కూడా తీవ్ర ఉద్రిక్తత ఏర్పరిచిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+