జగన్‌ను ఎదుర్కోవడం సాధ్యం కాని పని!: జెఎసి చైర్మన్ కోదండరామ్
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకుంటే మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం సాధ్యం కాదని తెలంగాణ జెఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మంగళవారం ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో అన్నారు. తెలంగాణ కాంగ్రెసు నేతల్లోని అసంతృప్తిని జగన్మోహన్ రెడ్డి సొమ్ము చేసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు, టిడిపి నేతలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం స్పష్టంగా ప్రజల మధ్యకు రావాల్సి ఉందన్నారు. ఈసారి తమ ఒత్తిడి కాంగ్రెసు శాసనసభ్యులపైనే ఉంటుందని చెప్పారు.
జెఏసిలో చిన్నపాటి అభిప్రాయ బేధాలు ఉండి ఉండవచ్చునని చెప్పారు. అంతమాత్రాన సమస్య ఏమీ లేదన్నారు. గురువారం జెఏసి విస్తృతస్థాయి సమావేశం ఉంటుందని చెప్పారు. ఉద్యమ భవిష్యత్తుపై ముసాయిదా రూపకల్పన ఉంటుందని చెప్పారు.
Telangana JAC chairman Kodandaram said today that there is no easy to fight with Ex MP YS Jaganmohan Reddy, if Congress and TDP leaders will not stand on Telangana.
Story first published: Tuesday, May 3, 2011, 14:10 [IST]