అరుణాచల్ ప్రదేశ్ సిఎం దోర్జీ ఖండు మృతి, హెలికాప్టర్ శకలాలు లభ్యం

ఖండుతో పాటు పైలట్లు కెప్టెన్ జెఎస్ బబ్బర్, కెప్టెన్ టిఎస్ మామిక్, ఖండు భద్రతాధికారి యేశి చోడ్డక్, యేషీ లామూ, తవంగ్ ఎమ్మెల్యే సోదరి సెవాగ్ దోందుప్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. హెలికాప్టర్ శనివారంనాడు 13,700 అడుగుల ఎత్తున భూటాన్ సరిహద్దుల్లోని సెలా పాస్ వద్ద ఉన్నప్పుడు చివరి సంకేతాలను అందించింది. భూటాన్ సరిహద్దుల్లో హెలికాప్టర్ కిందికి వచ్చినట్లు తెలుస్తోంది.
విపరీతమైన మంచు, భారీ వర్షం వల్ల ఖండు కోసం ప్రారంభించిన వేట మంగళవారం ముందుకు సాగలేదు. సంఘటనా స్థలానికి సహాయ బృందాలు చేరుకోవడానికి ప్రత్యేకమైన తాళ్లను తెప్పిస్తున్నట్లు సమాచారం. వాతావరణం సరిగా లేకపోవడంతో భారత వైమానిక దళం ఆదివారం అన్వేషనను ఆపేసింది. మళ్లీ సోమవారం వేట ప్రారంభించింది.












Click it and Unblock the Notifications