జగన్ ఫ్యాన్‌కు గాలి జనార్దన్ రెడ్డి కరెంట్, అందుకే బిజెపి గాలి వీస్తోంది

దివంగత నేత వైస్ రాజశేఖర రెడ్డి డబ్బులు తిన్న రాష్ట్ర మంత్రులు ఉప ఎన్నికల్లో ఎవరికి ప్రచారం చేస్తారో చెప్పాలని తెలుగుదేశం పార్టీ మరో నాయకుడు దాడి వీరభద్ర రావు అన్నారు. కేంద్ర బలగాలను ఉప ఎన్నికలు జరిగే స్థానాలకు పంపాలని కోరితే ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే భయంతో జగన్ కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అవినీతి జగన్‌ను ఓడించాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు.
కడప ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, జగన్ పార్టీలు పోటాపోటీగా డబ్బు పంపిణీ చేస్తున్నాయని దాడి వీరభద్రరావు ఆరోపించారు. జగన్‌ను గెలిపించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వ్యవహారశైలి ఉందని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులు పూర్తిచేస్తానని ప్రకటించి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని అన్నారు.












Click it and Unblock the Notifications