కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నికల ప్రచారం ముగిసింది, ఇక పంపకాల తంతు మిగిలింది!

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vivekananda Reddy-Ys jagan-Dl Ravindra reddy
హైదరాబాద్: మూడు పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కడప జిల్లాలో ప్రచార పోరు ముగిసింది. ఇక ఆయా పార్టీల నేతలు మద్యం, డబ్బుపై దృష్టి సారించనున్నారు. శుక్రవారం సాయంత్రం అయిదు గంటలకు ప్రచారం ముగిసింది. అయితే అధికారికంగా శుక్రవారం ముగిసినప్పటికీ మూడు ప్రధాన పార్టీలు గురువారమే ముగించి మద్యం, డబ్బు పంపకాలపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఇక శుక్రవారం ప్రచారం సమయం కూడా ముగిసి పోవడంతో అందరూ డబ్బు పంపకాలపై దృష్టి సారించనున్నారు. అయితే ఆయా పార్టీల నేతలు పంపకాలపై దృష్టి సారించే పరిస్థితి ఉన్నందున ఎన్నికల సంఘం కూడా జిల్లాలో భారీగా పోలీసులను మోహరించింది.

నేతల కదలికలపై దృష్టి సారించింది. కడపలో మొత్తం 11వేల మంది పోలీసులను దించింది. 267 మొబైల్ పోలీసు బృందాలు అందులో ఉన్నాయి. 1512 పోలింగ్ కేంద్రాలలో 6200 ఇవిఎంలను ఏర్పాటు చేయనున్నారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలపై ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి సారించింది. గత కొన్నేళ్లుగా పులివెందుల, కడపలో ఏకపక్ష పోలింగ్ జరుగుతున్నదనే ఆరోపణలు ఉన్న నేపథ్యాన్ని కూడా ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుంటోంది.

కడప జిల్లాలో ఎన్నడూ చూడని విధంగా ఓటుకు వేల రూపాయలు కట్టబెడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ పార్టీ అయితే ఖచ్చితంగా ఓటు వేస్తారనుకునే వారికి రూ.3వేలు, వేస్తారను భావించే వారికి రూ.2వేలు, వేయరని తెలిసిన వారికి రూ.500 ఇస్తున్నారనే ఆరోపణలు టిడిపి ఇప్పటికే ఆరోపించింది. జగన్ వర్గం ఇప్పటి నుండే ఓటర్లను భయపెట్టి, ప్రలోభ పెట్టే అవకాశం ఉన్నదని కూడా వారు ఈసికి ఫిర్యాదు చేశారు. వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ కూడా కాంగ్రెసు పార్టీ అధికార దుర్వినియోగానికి, టిడిపి డబ్బులు పంచుతూ ఓటర్లను మభ్యపెట్టాలని చూస్తుందని ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెసు కూడా పోలీసులు కాంగ్రెసు కార్యకర్తలనే వేధిస్తున్నారని, జగన్ కు తొత్తులుగా మారిపోయారని ఆరోపిస్తున్నారు. ఏదైనా ఆదివారం జరిగే ఉప ఎన్నికలకు ఈసి భారీగానే బందోబస్తును చేసింది.

English summary
Election campaign is closed friday evening 5'O clock. Party leaders now concentrating to distribute amonut and liquer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X