వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
2జి స్పెక్ట్రమ్ స్కామ్‌తో కనిమొళికి ప్రత్యక్ష సంబంధం ఉంది: సిబిఐ

తనను అరెస్టు చేస్తారా అనేది తనకు తెలియదని కనిమొళి అన్నారు. పాటియాలా హౌస్ కోర్టు ఆవరణలో ఆమె శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కనిమొళి తరఫున ప్రముఖ న్యాయవాది రాం జెత్మలానీ వాదిస్తున్నారు. కలైంగర్ టీవీకి డబ్బులు బదిలీ అయిన వ్యవహారంలో కనిమొళికి సంబంధం లేదని జెత్మాలనీ అన్నారు. కనిమొళి ఏ విధమైన నేరం చేయలేదని, ఆమె టీవీ చానెల్ వాటాదారు మాత్రమేనని చెప్పారు. కుట్ర పాత్రధారి రాజా మాత్రమేనని, కనిమొళి కారని ఆయన అన్నారు. బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కనిమొళి కోర్టుకు హాజరయ్యారు.