ఓటర్లను భయపెడుతున్న డిఎల్‌ను గృహనిర్బంధం చేయాలి: అంబటి

Ambati Rambabu
హైదరాబాద్: మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తనకు వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల నుండి ప్రాణహాని ఉందని చెప్పడం హాస్యాస్పదం అని వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ నేత అంబటి రాంబాబు ఆదివారం ఆశ్చర్యం వెలిబుచ్చారు. డిఎల్ తన దర్పం ప్రదర్శిస్తూ ఏజంట్లను, ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. ఆయనను తక్షణం గృహనిర్బంధం చేయాలని కాంగ్రెస్ పార్టీ నేత డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఎన్నికల సంఘానికి ఒక వినతి పత్రం ఇచ్చారు. అనంతరం సచివాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాణ భయం ఉందనడానికి అధికారంలో జగన్ ఉన్నారా, కిరణ్ ఉన్నారా అని ప్రశ్నించారు.

మంత్రి డిఎల్ ఉదయం నుంచి బూత్ ల వద్దకు వెళుతూ ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. బూత్ ల లోపలకు అభ్యర్థిగా అయనను అనుమతిస్తారని, పిఏని ఎలా అనుమతిస్తారని ఆయన ప్రశ్నించారు. మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డిని ఓటమి భయంతో డిఎస్ అసత్యప్రచారాలు చేస్తున్నారని అన్నారు. మంత్రి రవీంద్రా రెడ్డి భార్య సుభద్రమ్మ ఉదయం పోలింగ్ బూత్ లో ఇవిఎంల వద్ద కొబ్బరి కాయలు కొట్టారని, అలా ఎలా అనుమతిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇవిఎంల వద్ద టెంకాయలు కొట్టేందుకు అనుమతించిన అధికారులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉదయం నుంచి పోలింగ్ సరళి బాగుందన్నారు. ఈ విధంగా సాయంత్రం వరకు జరిగితే పోలింగ్ శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+