కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిచ్చుకు సోనియానే కారణం: భారతి, ఓటు వేయడానికి గంటకు పైగా క్యూలో

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Bharathi
కడప: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబాల మధ్య విభేదాలు రావడానికి కారణం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీయే కారణమని మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి ఆదివారం ఓటు వేసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. కుటుంబాల మధ్య వచ్చిన విభేదాలకు సోనియా సమాధానం చెప్పాలని అన్నారు.

పులివెందులలో, కడపలో వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ భారీ ఆధిక్యంతో గెలుపొందడం ఖాయమన్నారు. దేవుడు తమ వైపే ఉన్నాడని, తప్పకుండా గెలిపిస్తాడని అన్నారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వైయస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ పోలింగ్ ఏజెంటుగా ఉండటం తమ విజయంపై ఏమాత్రం ప్రభావం చూపదన్నారు. కాగా భారతి ఓటు వేయడానికి సుమారు గంటకు పైగా క్యూలైన్లో నిలబడ్డారు. కాగా కాంగ్రెసు అభ్యర్థి వైయస్ వివేకానందరెడ్డి తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.

English summary
Ex MP YS Jaganmohan Reddy wife Bharathi accused AICC president Sonia Gandhi for differences in YSR family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X