సాక్షి రిపోర్టర్, ఐన్యూస్ కెమెరామెన్‌పై మంత్రి డిఎల్ వర్గం దాడి!
State
oi-Srinivas G
By Srinivas
కడప మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అనుచరులు పలువురు మీడియాపై దాడి చేసినట్టుగా సమాచారం. ఖాజీపేట మండలం సుంకేశుల గ్రామంలో న్యూస్ కవరేజ్ కోసం వచ్చిన ఐన్యూస్ ఛానల్ కెమెరామెన్ మరియు మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి న్యూస్ ఛానల్ రిపోర్టర్‌పై దాడి చేసినట్టుగా తెలుస్తోంది.
అంతేకాకుండా ఓ ఛానల్‌కు చెందిన డిఎస్ఎన్‌జి వ్యాన్‌ను కూడా దగ్ధం చేసినట్టుగా తెలుస్తోంది. సుంకేశుల డిఎల్ సొంత గ్రామం కావడం విశేషం.