టిడిపిలో డబ్బుల గోల: విపక్షాల ఖర్చు ముందు బేజారు!

'ఆ జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న ప్రాంతం అంతా వెర్రెత్తి పోయిందా అన్న అనుమానం కలుగుతోంది. ప్రతి ఒక్కరూ ఫోన్లు చేసి డబ్బులు...డబ్బులని ప్రాణం తోడేస్తున్నారు. ఓటర్లు కూడా డబ్బులు ఇస్తేనే మాట్లాడండి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. యావత్ ఎన్నికల యంత్రాంగం కుప్ప కూలింది. డబ్బుల పంపిణీ యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకొనే నాధుడు కరువయ్యాడు' అని టీడీపీ ముఖ్య నేత ఒకరు వాపోయారు. కడపలో డబ్బు పంపిణీలో ప్రత్యర్థులతో పోటీ పడాల్సి రావడం ప్రతిపక్షంలోని టీడీపీకి ఇరకాటంగా మారింది.
వరుసగా రెండోసారి ప్రతిపక్షంలోకి రావడంతో వనరులపరంగా చాలా ఇబ్బందికర పరిస్ధితుల్లో ఉన్నామని, ఈ పరిస్థితుల్లో కడపలో తమ ప్రత్యర్థులకు ఈ విషయంలో దరిదాపులకు నిలవడం కూడా తమకు అసాధ్యంగా మారుతోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కడపలో ఈ పరిస్థితి వస్తుందని ముందే గుర్తించిన టీడీసీ నేతలు ఒక స్థాయిలో దానికి సిద్ధమయ్యారు. ఓటుకు రెండు వందల చొప్పున పేద వర్గాల వారి వరకూ పంపిణీ చేయాలన్నది వారి వ్యూహం. కాని ప్రత్యర్థి పార్టీలు పంచే మొత్తం భారీగా ఉండటంతో టీడీపీ నేతలు ఈ విషయంలో బాగా వెనకబడిపోయారు.












Click it and Unblock the Notifications