వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచంలోకెల్లా మోస్ట్ వాల్యూబుల్ బ్రాండ్‌గా ఆపిల్...

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Apple tops the list of World
బ్రాండ్ కొక వాల్యూ ఉంటుంది. ప్రపంచం మొత్తం మీద టాప్ బ్రాండ్ ఏ కంపెనీ సొంతం చేసుకుందో తెలుసుకోవడం కోసం గ్లోబల్ బ్రాండ్స్ ఏజెన్సీ మిల్‌వర్డ్ బ్రౌన్ ఓ రిపోర్డ్ తయారు చేసింది. గ్లోబల్ బ్రాండ్స్ ఏజెన్సీ చేసినటువంటి ఈ రిపోర్ట్‌లో గత నాలుగు సంవత్సరాల ముందు ఉన్నటువంటి వాల్యూకి ఇప్పుడున్న వాల్యూని చూస్తే ఆపిల్, గూగుల్ కంపెనీలు మొట్టమొదట స్దానంలో నిలచాయి.

పోయిన సంవత్సరం ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 50 బ్రాండ్స్‌లలో పోర్బ్స్ పత్రిక ప్రచురించడం జరిగింది. అందులో ఆపిల్ కంపెనీ టాప్ మోస్ట్ వాల్యూబుల్ బ్రాండ్‌గా స్దానం దక్కించుకుంది. ఆపిల్ పాపులర్ కంజూమర్ గూడ్స్ మైక్రోసాప్ట్ టెక్నాలజీని వరల్జ్ మోస్ట్ వాల్యూబుల్ టెక్నాలజీ కంపెనీగా ముందుకి తీసుకోని వెళ్శడం జరిగింది.

గ్లోబల్ బ్రాండ్ అయినటువంటి మిల్‌వర్డ్ బ్రౌన్ డైరెక్టర్ పీటర్ వాల్ష్ మాట్లాడుతూ ఆపిల్ కంపెనీ కార్పోరేట్ వాతావరణంలోకి తన వస్తువులు అయినటువంటి గాడ్జెట్స్, ఐపోన్స్, టాబ్లెట్స్‌ని ఎప్పటికప్పుడు వినూత్నంగా ప్రవేశపెడుతూ వినియోగదారుల ప్రశంసలు అందుకుందని వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో తనదైన ముద్రని వేసింది. ఉత్పత్తులను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టడంలో కొత్త పంధాని ఉపయోగించిన ఆపిల్, మోడళ్శకు ధర నిర్ణయించడంలో కూడా రూల్స్‌ని బ్రేక్ చేసింది.

ఒకవేళ ఏదైనా మోడల్‌కి ఎక్కువ రేటు ఉంచినప్పటికీ మిగతా కంపెనీల బ్రాండ్స్‌లలో లేనటువంటి కొత్త ఫీచర్స్‌ని తమ మోడళ్శలలో ఉండేటట్లు నిర్ణయం తీసుకుంది. ఈరోజు అంటే మే 9వ తారీఖున టెక్నాలజీని, అదేవిధంగా టెలికామ్స్‌ని డామినేట్ చేసినటువంటి మొదటి పది కంపెనీలు పేర్లు బయటకు వెల్లిడించడం జరిగింది. అందులో వరుసగా మొట్టమొదటి స్దానంలో ఆపిల్, తర్వాత గూగుల్, ఆ తర్వాత ఐబియమ్ నిలచాయి.

మెక్ డోనాల్డ్స్ రోజ్ రెండు రంగాలలోను నాల్గవ ప్లేసులో నిలచింది. కోకా-కోలా, మార్ల్‌బోరో ఆరు, ఎనిమిది స్దానాలలో నిలచాయి. పోయిన సంవత్సరం రెండవ స్దానంలో చోటు దక్కించుకున్న మైక్రోసాప్ట్ ఈ సంవత్సరం ఐదవ స్దానంలోకి వెళ్శింది. ఏటి అండ్ టి కంపెనీ ఏడవ స్దానాన్ని, చైనా మొబైల్ కంపెనీ తొమ్మిదవ స్దానాన్ని, జనరల్ ఎలక్ట్రిక్ పదవ స్దానాన్ని కైవసం చేసుకున్నాయి. పాపులర్ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ టాప్ 100 బ్రాండ్స్‌లలో 35వ స్దానాన్ని సంపాదించుకుంది. అదేవిధంగా చైనీస్ సెర్చ్ ఇంజన్ బైదు, రోజ్ 29, 64 స్దానాలను దక్కించుకున్నాయి.

English summary
With a brand value of $153 billion, Apple has usurped Google as the most valuable brand in the world. As per the annual Brand Z study of the world’s top 100 brands by global brands agency Millward Brown, ending a four-year reign by the Internet search leader, Apple now costs double of its capitalization.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X