సోనియాతో మమతా భేటీ: ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం!
National
oi-Srinivas G
By Srinivas
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో ముప్పయి అయిదేళ్ల అనంతరం కమ్యునిస్టుల కంచుకోటను బద్దలుకొట్టిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నేడు ఢిల్లీ కార్య వ్యవహారాల్లో పూర్తిగా నిమగ్నం కానున్నారు. ముందుగా యుపీఏ అధినేత్రి సోనియా గాంధీని కలిసి రాష్ట్ర ప్రభుత్వంలో చేరవలసిందిగా ఆహ్వానం పలుకనున్నారు. అలాగే బెంగాల్ సీఎంగా తన ప్రమాణ స్వీకారమహోత్సవానికి ఆహ్వానిస్తారు.
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను సైతం కలిసి రైల్వే మంత్రి పదవికి రాజీనామా నిర్ణయాన్ని వెల్లడిస్తారు. చివరిసారిగా రైల్వేమంత్రిత్వ కార్యాలయానికి వెళ్ళి అత్యవసర ఫైళ్ళపై సంతకాలు పూర్తి చేస్తారు.