కరుణానిధికి షాక్: జయలలితకు సోనియాగాంధీ తేనీటి విందు

Jayalalitha
న్యూఢిల్లీ: ఎన్నికల ఫలితాలు వచ్చీ రాగానే జాతీయ కాంగ్రెసు పార్టీ తదుపరి జరగనున్న 2014 ఎన్నికలపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా సోనియాగాంధీ డిఎంకెకు షాక్ ఇస్తూ అన్నాడిఎంకె అధినేత్రి జయలలితకు ఫోన్ చేసి తేనీటి విందుకు న్యూఢిల్లీకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. అయితే జయలలితకు ఫోన్ చేయడంపై విలేకరులు కాంగ్రెసును ప్రశ్నించగా అది కేవలం మర్యాద పూర్వకమే అని చెప్పారు. ఓ మహిళా నేత గెలవడం పట్ల సోనియా అభినందనలు తెలియజేసిందని చెప్పారు. అయితే వారు అలా చెబుతున్నప్పటికీ సోనియాగాంధీ మూడేళ్ల తర్వాత జరగనున్న 2014 ఎన్నికలపై దృష్టి సారించినట్లుగా పలువురు భావిస్తున్నారు.

2జి కుంభకోణం నేపథ్యంలో డిఎంకే దారుణంగా ఓటమి చెందడంతో కాంగ్రెసు జయలలిత కూటమితో కలిసి వచ్చే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు డిఎంకెతో దోస్తీని తెంచుకోనప్పటికీ ముందు ముందు కరుణానిధికి దూరం జరుగుతూ, జయలలితకు దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నందువల్లే సోనియా కాల్ చేసినట్లుగా పలువురు భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు డిఎంకెతో తెగతెంపులు చేసుకుంటే ప్రజల్లో చెడ్డపేరు వస్తుందని కాంగ్రెసు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం జయలలితతో మాట్లాడి క్రమంగా ఆమెకు దగ్గరవ్వవచ్చని కాంగ్రెసు భావిస్తున్నట్లుగా సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+