తెలంగాణపై తేల్చేందుకే ఆజాద్ రాక, రెడీగా ఉండాలని నేతలకు సూచన?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నప్పటికీ తెలంగాణ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సీమాంధ్ర పార్టీ నాయకులు కూడా కోరుతున్నారు. సమస్య పరిష్కారం విషయంలో జాప్యం చేస్తే పార్టీకే నష్టం జరుగుతుందని వారు చెబుతున్నారు. మరోవైపు, తెలంగాణ నాయకుల నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మళ్లీ తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసే ఆలోచనలో ఉన్నారు. దానివల్ల తెలంగాణలో కెసిఆర్ లాభపడే అవకాశాలున్నాయని, కెసిఆర్ లాభపడకుండా చూడాలంటే సాధ్యమైనంత త్వరగా తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెసు తెలంగాణ నాయకులు అంటున్నారు.
వైయస్సార్ సానుభూతి వల్లనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్ కడప ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిచారని కాంగ్రెసు నాయకులు బయటకు చెబుతున్నప్పటికీ సీమాంధ్రలో ఆయనకు తిరుగు ఉండదనే విషయాన్ని గుర్తించినట్లు చెబుతున్నారు. సీమాంధ్రలో వైయస్ జగన్, తెలంగాణలో కెసిఆర్ పాగా వేస్తే పార్టీ పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. ఈ విషయాన్ని గమనించే తెలంగాణపై దృష్టి సారించాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications