చంద్రబాబుకు షాక్: వైయస్ జగన్‌కు సిపిఎం నేత రాఘవులు మద్దతు

కడప, పులివెందుల ఉప ఎన్నికలపై ఆయన కేంద్ర నాయకత్వానికి ఓ నివేదిక సమర్పించారు. ఉప ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల మాదిరిగా జరిగాయని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలు విఫలం కావడం వల్ల వైయస్ జగన్ పుంజుకుంటున్నట్లు ఆయన సోమవారం చెప్పారు. తెలంగాణ ఉద్యమం కొనసాగడానికి కాంగ్రెసు పార్టీయే కారణమని ఆయన అన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఆయన విమర్శించారు. మార్కెట్ శక్తులకు స్వేచ్ఛనివ్వడం సరి కాదని ఆయన అన్నారు.
అన్ని శక్తులు తమకు వ్యతిరేకంగా ఏకం కావడం వల్లనే పశ్చిమ బెంగాల్‌లో ఓడిపోయామని ఆయన చెప్పారు. సిపిఎంను ఓడించడానికి అన్ని శక్తులు ఏకమయ్యాయని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో తమకు 11 లక్షల ఓట్లు పెరిగాయని, దీన్ని బట్టి తాము బలహీనపడలేదని అర్థమవుతోందని ఆయన అన్నారు. కేరళలో తమ పార్టీ బలపడిందని ఆయన చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీ ప్రభుత్వం కొన్ని లోపాలు, పొరపాట్లకు పాల్పడిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications