ప్రజాస్వామ్యం పట్టని గవర్నర్‌ను రీకాల్ చేయాలి: యెడ్యూరప్ప

అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు రాష్ట్ర మంత్రివర్గ అత్యవసర సమావేశం కూడా జరగనుంది. రాష్ట్రపతి పాలనకు కేంద్రానికి భరద్వాజ్ సూచించడంతో యెడ్యూరప్ప కూడా ఆయనతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్థమయ్యారు. తన బలాన్ని నిరూపించుకునేందుకు ఈరోజు మధ్యాహ్నాం 12 గంటలకు సీఎంతో పాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజ్‌భవన్ ఎదుట ధర్నాకు దిగనున్నారు. గవర్నర్ తీరును నిరసిస్తూ యెడ్యూరప్ప ఇప్పటికే కేంద్రానికి, రాష్ట్రపతికి లేఖ కూడా రాశారు. న్యాయశాఖ మంత్రిగా పని చేసిన గవర్నర్ ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వ్యకిగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఇబ్బందులలోకి నెట్టే దిశలో ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. కాగా కర్ణాటక పరిస్థితులపై మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ నేతృత్వంలో ఎన్డీయే సమావేశం కానుంది. కర్ణాటక పరిస్థితులపై చర్చించనుంది.












Click it and Unblock the Notifications