ఏ రెండేళ్లో ఉంటే ప్రభుత్వం పడిపోయేది: ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి

Mekapati Rajamohan Reddy
గుంటూరు: రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు మరో మూడు సంవత్సరాలు ఉన్నందువల్లే చాలామంది శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు కాంగ్రెసు పార్టీతో ఉన్నారని, మరో ఒకటో రెండో సంవత్సరాలు ఉంటే అందరూ జగన్ వెంట నడిచే వారన్నారు. ఎన్నికలకు ఎక్కువ రోజులు ఉన్నందువల్లే ఎమ్మెల్యేలు కాంగ్రెసు ప్రభుత్వంతో ఉన్నారని అన్నారు. కాంగ్రెసు ఎమ్మెల్యేలో చాలామంది ముందు ముందు జగన్ వెంట నడవక తప్పదన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెసు పార్టీలు ప్రజల విశ్వాసం కోల్పోయాయని చెప్పారు. టిడిపి, కాంగ్రెసు కడప ఎన్నికల ముందు జగన్‌కు యాభై వేల మెజార్టీ వస్తుందా అని ప్రశ్నించారని, అయితే జగన్‌కు ఐదు లక్షలకు పైగా మెజార్టీ ఇచ్చి కడప ఓటర్లు వారికి బుద్ధి చెప్పారన్నారు.

జగన్‌కు మెజార్టీ ఎక్కువ రాదని చెప్పిన కాంగ్రెసు నేతల మాటలు విని పందేలు కాసిన వారు అన్యాయమై పోయారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి బోళా శంకరుడు అయితే వైయస్ జగన్ మహా విష్ణువు అన్నారు. జగన్ ప్రభావాన్ని రాష్ట్రంలో ఎవరూ ఆపలేరన్నారు. జగన్‌తో రాష్ట్రంలో ప్రజా విప్లవం వస్తుందన్నారు. జగన్ రాష్ట్రంలో చారిత్రక విప్లవం తీసుకు వచ్చారన్నారు. వైయస్ లేని లోటును తీర్చగలిగే వాడు కేవలం జగనే అన్నారు. జగన్ వద్ద ఎవరైనా విశ్వాసంతో ఉండగలరు కానీ మోసంతో ఉండలేరన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+