ఆజాద్ వద్దకు సింగిల్ పాయింట్‌తో వెళ్లాం, తెలంగాణ కోసం రాజీనామాకు సిద్ధం

తెలంగాణపై కాలాయపన చేస్తే ప్రజలు ఊరుకోరన్నారు. జూన్ రెండో వారంలోగా తెలంగాణపై నిర్ణయం తీసుకోకుంటే రాజీనామాలకు సిద్ధం అని చెప్పారు. కేంద్రం డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని తాము ఆజాద్‌కు చెప్పినట్టు మంత్రి బస్వరాజు సారయ్య చెప్పారు. తెలంగాణ ఆందోళకు విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరి మద్దతు ఉన్న విషయాన్ని ఆజాద్ దృష్టికి తీసుకు వచ్చినట్టు చెప్పారు. తాము ఆజాద్‌ను తెలంగాణ అనే ఒకే ఒక పాయింట్‌తో కలిశామని చెప్పారు. కాగా జగన్‌కు తెలంగాణ అంశానికి సంబంధం లేదన్నారు. అయితే జగన్‌తో వెళ్లిన ఎమ్మెల్యేల వైఖరిని మాత్రం ఆయన తప్పు పట్టారు. పార్టీలో క్రమశిక్షణ తప్పుతోందన్నారు.












Click it and Unblock the Notifications