వైయస్ జగన్‌పై శంకర్ రావును నిలబెట్టాల్సింది: జెసి దివాకర్ రెడ్డి
State
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: కడప, పులివెందుల ఉప ఎన్నికల బరిలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థులుగా మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి, వైయస్ వివేకానందరెడ్డిలకు బదులు మంత్రి శంకర్‌రావును నిలబెట్టవలసి ఉండేదని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా కాంగ్రెసు పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జెసి దివాకర్ రెడ్డి బుధవారం వ్యంగ్యంగా చెప్పారు. శంకర్‌రావు దేనికైనా సమర్థుడే అన్నారు. శంకర్ రావు జిందాబాద్ అంటూ విలేకరులకు కనువిందు కూడా చేశారు. శంకర్ రావు చేసిన మేలు ఎవరూ చేయరని అన్నారు. ఆయన ఏం చేసినా కరెక్టుగానే ఉంటుందని అన్నారు.
తెలంగాణపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తామంతా కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలన బాగానే ఉందని అభిప్రాయపడ్డారు.
Ex minister JC Diwakar Reddy supported minister Shankar Rao comments that congress is very strong. He said he will ready to high command stand on Telangana.