గులాం నబీ ఆజాద్ కెసిఆర్ ఫోన్, తెలంగాణపై తేల్చాలని విజ్ఞప్తి

మర్యాదపూర్వకంగానే కెసిఆర్ ఆజాద్‌కు ఫోన్ చేశారని తెరాస వర్గాలు చెప్పాయి. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెసు అధిష్టానం ఇచ్చిన హామీని కెసిఆర్ గుర్తు చేశారు. ఐదు నిమిషాల పాటు వారిద్దరి మధ్య సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే తాము పెద్ద యెత్తున ఆందోళనకు సిద్ధపడుతున్నామని కెసిఆర్ చెప్పినట్లు సమాచారం. జూన్ లోగా కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కెసిఆర్ కోరారు.












Click it and Unblock the Notifications