డుండీ యూనివర్సీటిలో ఈగల్ని దోచుకెళ్లిన దొంగలు

అవునా ఎక్కడ జరిగింది..?
బ్రిటన్‌లోని డుండీ యూనివర్సీటిలో...
ఏం దోచుకెళ్లారేంటి..?
"ఈగలు".
ఈగలా...!! ఈగల్ని దోచుకెళ్లారా..?
అవును ఈగలే కాకపోతే, అత్యంత విశిష్టమైన తేనెటీగలు.
వాటితో ఏంచేస్తారు..? కొంపదీసి కూర వండుకుంటారా లేక తేనె పిండుకుంటారా..?
అవి మామూలు తేనెటీగలు కాదు. కొన్ని కోట్లు ఖర్చుచేసి శాస్త్రవేత్తలు చేపట్టిన ఓ రీసెర్చ్ ప్రాజెక్ట్‌లో భాగంగా సేకరించిన ప్రత్యేక జాతికి చెందినవి. న్యూరోసైన్స్ అధ్యయనం కోసం వీటిని సేకరించారు.
ఎన్ని ఈగలు పోయాయ్..?
ఒకటి కాదు రెండు కాదు.. వేలాది సంఖ్యలో ఈగలు పోయాయి. నాలుగు ప్రత్యేక బాక్సుల్లో ఉంచిన ఈగల్ని దుండగులు అపహరించారు.
అస్సలు ఈ ప్రాజెక్ట్ ఏంటి..?
అంతరించిపోతున్న తేనెటీగల జాతుల గురించి చేస్తున్న అధ్యయనం. ఈ ప్రాజెక్టుకు డాక్టర్ క్రిస్ కన్నోలీ నాయకత్వం వహిస్తున్నారు.
మరి పరిశోధకులు ఏంచేశారో..?
ఏముంది ఈగలు పోయాయని స్కాట్‌లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తర్వాత..?
తర్వాతేముంది ఆ ఈగల ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం అందజేయండని స్కాట్‌లాండ్ పోలీసులు ప్రజలకు పిలుపునిచ్చారు. వాటి గురించి మీకేమన్నా తెలిస్తే వెంటనే స్కాట్‌లాండ్ పోలీసులకు సమాచారం అందించండి.


Click it and Unblock the Notifications