రజనీకాంత్ క్షేమంగా ఉన్నారు, చికిత్సకు స్పందిస్తున్నారు: భార్య లత

రజనీకాంత్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందనే వార్తలను ఆమె ఖండించారు. ఊహాగానాలకు, వార్తాకథనాలకు తాను సమాధానం ఇవ్వదలుచుకోలేదని ఆమె చెప్పారు. రజనీకాంత్ త్వరగా కోలుకుని రాణా సినిమా షూటింగులో పాల్గొనాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. రజనీకాంత్ ఆస్పత్రి పాలు కావడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్‌లో రాశాడు. తాను రజనీకాంత్‌తో మాట్లాడానని, రజనీ భార్యను తాను సంప్రదిస్తున్నానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications