తెరాస అధినేత కెసిఆర్ తెలంగాణ ఉద్యమానికి తీవ్రమైన ఎండ దెబ్బ

తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్న ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో ఎండ దంచికొడుతోంది. దీంతో కొద్ది మంది మాత్రమే ధర్నాలకు హాజరయ్యారు. పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు, విద్యార్థులు ఎండలకు భయపడి రావడం లేదని తెరాస నాయకులు చెబుతున్నారు. పార్టీ నాయకులు పదే పదే గుర్తు చేసినా, సంప్రదించినా హాజరు శాతం తక్కువే ఉంటోంది.
నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కెసిఆర్ సొంత జిల్లా మెదక్‌లో ఆందోళనల ఊసే లేదు. రంగారెడ్డి జిల్లాలో కూడా అదే స్థితి. ఎండ దెబ్బకు భయపడే ఎవరూ రావడం లేదని, ఎండ దెబ్బకు భయపడే కెసిఆర్ కరీంనగర్ పర్యటనను రద్దు చేసుకున్నారని చెబుతున్నారు. మే 25వ తేదీన జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు, 30వ తేదీన రైల్ రోకో కార్యక్రమాలు జరగాల్సి ఉంది.