గూగుల్ క్రోమ్ యాడ్ కోసం చిందేసిన పాప్ సింగర్ లేడిగాగా

గూగుల్ ఈ యాడ్‌కి సంబంధించినటువంటి సమాచారం ఇటీవలే విడుదల చేసింది. ఈయాడ్ మొత్తం 90నిమిషాలు పాటు ఉంటుంది. ఇందులో లేడిగాగా సోషల్ మీడియాని ఉపయోగించి తన మేసేజ్‌లను అభిమానులకు ఎలా చేరవేస్తుందో చాలా స్పష్టంగా చూపించడం జరిగింది. అలా లేడిగాగా అభిమానులు తన యొక్క సాంగ్స్‌ని ఎలా పాడతాకో, ఎలా డాన్స్ చేస్తారో చూపించారు. అంతేకాకుండా లేడిగాగా గూగుల్ సర్వీసెస్ అయినటువంటి యూట్యూబ్, క్రోమ్ వెబ్ బ్రౌజర్, గూగుల్ సెర్చ్ ఇంజన్ మొదలగునవి ఉపయోగించి తన అభిమానులకు ఎలా దగ్గరయ్యారో ఉంటుంది.
లేడిగాగా గూగుల్ యాడ్ చివరకు ఎలా ముగుస్తుందంటే 'ద వెబ్ ఈజ్ వాట్ యు మేక్ ఆఫ్ ఇట్'. ఈ యాడ్ ద్వారా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లేడిగాగా అభిమానులకు బాగా దగ్గరవుతుందనే అభిప్రాయంతో గూగుల్ యాజమాన్యం ఉంది. ఇది ఇలా ఉంటే గతంలో డియర్ సోఫి అనే కమర్షియల్ యాడ్‌ని రూపోందించింది. ఈ యాడ్‌లో ఫాదర్ తన బేబికి తన జీవితం మొత్తం ఈమెయల్ నోట్స్, ఫోటోస్, వీడియోస్ లాంటి పంపుతు ఉంటాడు. చూసేవారికి ఈ యాడ్ చాలా అందంగా ఇట్టే ఆకట్టుకునే విధంగా రూపోందించిన విషయం తెలిసిందే.