పార్టీ సమావేశానికి జూ. ఎన్టీఆర్ వర్గం నేతలు వంశీ, నాని డుమ్మా
Districts
oi-Pratapreddy
By Pratap
|
మచిలీపట్నం: చంద్రగిరి నియోజకవర్గం ఇంచార్జీగా నారా లోకేష్‌ను నియమించాలని ఆ నియోజకవర్గం నాయకులు ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా తెలుగుదేశం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నారా లోకేష్‌కు జూనియర్ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా రాజకీయాలను విరుగుడుగా ప్రయోగిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో మచిలీపపట్నంలో ఏర్పాటైన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి జూనియర్ ఎన్టీఆర్ వర్గానికి చెందిన నేతలు డుమ్మా కొట్టారు. మహానాడులో ప్రవేశపెట్టాల్సిన తీర్మానాలపై చర్చించడానికి ఈ సమావేశం జరిగింది.
కృష్ణా జిల్లాలోని విజయవాడ అర్బన్ పార్టీ అధ్యక్షుడు వల్లభనేని వంశీ, శాసనసభ్యుడు కొడాలి నాని పార్టీ విస్తృత సమావేశానికి డుమ్మా కొట్టారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే వారు సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తోంది. తన రాజకీయ వ్యూహాన్ని జూనియర్ ఎన్టీఆర్ రహస్యంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు.