రాజీవ్ గాంధీ హత్యకు క్షమాపణ చెప్పిన ఎల్‌టిటిఇ నేత పద్మనాభన్

సిఎన్ఎన్ - ఐబియన్ ఫస్ట్ పోస్ట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. పద్మనాభన్ ఎల్‌టిటిఇ కోశాధికారిగా, ఆయుధ సేకరణ బాధ్యుడిగా వ్యవహరించారు. ప్రభాకరన్ తప్పిదానికి భారత ప్రజలకు, ప్రత్యేకంగా గాంధీ కుటుంబ సభ్యులకు తాను క్షమాపణ చెప్పదలుచుకున్నట్లు ఆయన తెలిపారు. "దయచేసి మమ్మల్ని క్షమించండి. నేను వేడుకుంటున్నాను. దానికి నా విచారం. రాజీవ్ గాంధీ కుమారుడి (రాహుల్ గాంధీ) మనోభావాలు నాకు తెలుసు. రాజీవ్ గాంధీతో కూతురు, కుమారులకు ఎంత అనుబంధం ఉండేదో నాకు తెలుసు" అని ఆయన అన్నారు.
శ్రీలంకలోని తమిళులు మానవులుగా జీవించే వెసులుబాటు కోరుకుంటున్నారని, ఇప్పటికే తాము ఎంతో మూల్యం చెల్లించామని, మరింతగా నష్టపోవడానికి తాము సిద్ధంగా లేమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications