టిడిపి కరీంనగర్ రణభేరీ సమైక్యాంధ్రుల కుట్ర: కోదండరామ్

Kodandaram
హైదరాబాద్‌: సమైక్యాంధ్రుల కుట్రలో భాగంగానే తెలుగుదేశం తెలంగాణ ఫోరం కరీంనగర్‌లో తెలంగాణ రణభేరీ బహిరంగ సభను తలపెట్టిందని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలపైనే తెలుగుదేశం తెలంగాణ నాయకులు రణభేరీ మోగిస్తున్నారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. తెలుగుదేశం రణభేరీకి ప్రజల సహకరించవద్దని ఆయన కోరారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకుంటే ప్రజల్లో విశ్వసనీయత ఉండదని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ శానసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డిపై జెఎసి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. కుంటాల జలపాతంపై సీమాంధ్రుల జల విద్యుత్కేంద్రం నిర్మాణాన్ని అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ విడిగా డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో బుధవారం తెలుగుదేశం తెలంగాణ ఫోరం తలపెట్టిన తెలంగాణ రణభేరీ బహిరంగ సభను అడ్డుకుంటామని ఒయు, కాకతీయ విశ్వవిద్యాలయాల విద్యార్థులు ప్రకటించారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు పలువురిని అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+