తెరాస నాటకాలు సాగవు, జెఎసి బయటకు రావాలి: ఎర్రబెల్లి దయాకర్ రావు

తెలంగాణ కోసం ఎటువంటి పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి తెలంగాణ కోసం పోరాటానికి ముందుకు రావాలని ఆయన అన్నారు. కళాకారులు, మేధావులు, తెరాసకు దూరమైనవారు కలిసి ఒక వేదికగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణకు ద్రోహం చేసినవారికి కరీంనగర్ రణభేరీ కనువిప్పు కలిగించిందని ఆయన అన్నారు. తమ పార్టీ సస్పెండ్ అయిన నాగం జనార్దన్ రెడ్డిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాగం జనార్దన్ రెడ్డి చిల్లర పనులు మానుకోవాలని ఆయన సూచించారు. నాగం జనార్దన్ రెడ్డి ఎవరితో ఉన్నారో తమకు తెలుసునని, నాగం జనార్దన్ రెడ్డికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా తెలుసునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications