హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పిసిసి అధ్యక్షుడిగా బొత్సకు చిరంజీవి మద్దతు, కిరణ్ కుమార్ వ్యతిరేకం

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్ష పదవికి బొత్స సత్యనారాయణ పేరును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. బొత్సకు పిసిసి అధ్యక్ష పదవిని అప్పగించాలనే కాంగ్రెసు పార్టీ అధిష్టానం ప్రయత్నాన్ని ఆయన అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. గత వారం ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లినప్పుడు అది జరిగినట్లు సమాచారం. పిసిసి అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణను ఎంపిక చేస్తున్నామని పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, పి. చిదంబరం సమక్షంలో కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పారని సమాచారం. ఉప ముఖ్యమంత్రిగా దామోదరం రాజనర్సింహను, స్పీకర్‌గా నాదెండ్ల మనోహర్‌ను, డిప్యూటీ స్పీకర్‌గా మల్లు భట్టి విక్రమార్కను ఎంపిక చేశామని ఆజాద్ ముఖ్యమంత్రికి చెప్పారని అంటున్నారు.

వెంటనే పిసిసి అధ్యక్ష పదవికి శ్రీధర్ బాబు పేరును ముఖ్యమంత్రి ప్రతిపాదించారని అంటున్నారు. శ్రీధర్ బాబు ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడగలరని, అన్ని వర్గాలను సమిష్టిగా ముందుకు నడిపించగలరని, పైగా శ్రీధర్ బాబు తెలంగాణకు చెందినవాడని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణను పిసిసి అధ్యక్షుడిగా చేస్తే రాష్ట్రంలో మరో అధికార కేంద్రం ఏర్పడుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ ఏర్పాటు సందర్భంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆయన మంత్రులను కూడగట్టారు. పైగా, బొత్స పిసిసి అధ్యక్ష పదవికి తగినవారు కాదని చెప్పడానికి ఎమ్మెల్సీ పాలడుగు వెంకటరావును ముఖ్యమంత్రి ఆజాద్ వద్దకు పంపినట్లు తెలుస్తోంది.

ఇంతలో బొత్స సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మినారాయణ పేరు పిసిసి అధ్యక్ష పదవికి ముందుకు వచ్చింది. అయితే, ఆయనను పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు వ్యతిరేకిస్తున్నారు. శ్రీధర్ బాబు కాకపోతే కన్నా లక్ష్మినారాయణ అయితే బాగుంటుందని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. అయితే, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి మాత్రం బొత్స సత్యనారాయణకు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవిని కాంగ్రెసు పార్టీలోకి తేవడంలో బొత్స సత్యనారాయణ కీలక పాత్ర పోషించారు. చిరంజీవితో తనకు ఉన్న సంబంధాలను అందుకు వాడుకున్నారు.

English summary
According to sources, when chief minister N Kiran Kumar Reddy went to New Delhi last week, the AICC general secretary for Andhra Pradesh affairs, Ghulam Nabi Azad, reportedly informed him in the presence of Pranab Mukherjee and P Chidambaram that the party high command had decided on the name of Botsa Satyanarayana as the PCC President, Damodar Raja Narasimha as deputy chief minister, Nadendla Manohar as Speaker and Bhatti Vikramarka as deputy speaker.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X