హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేబిస్ సోకిన కుక్కలు: టిడిపి తెలంగాణ నేతలపై కెటి రామారావు వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

KT Rama Rao
హైదరాబాద్: తెలుగుదేశం తెలంగాణ నాయకులు రేబిస్ వ్యాధి సోకిన కుక్కల కన్నా హీనంగా వ్యవహరించారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు వ్యాఖ్యానించారు. కరీంనగర్ తెలంగాణ రణభేరీ సభలో తెలుగుదేశం తెలంగాణ నాయకులు అసభ్య పదజాలం ప్రయోగించారని ఆయన ఆరోపించారు. రణభేరీని తమ పార్టీని, తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును విమర్శించడానికే వాడుకున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అది కరీంనగర్ రణభేరీ కాదని టిడిపి సర్కస్ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలను రెచ్చగొట్టడానికే తెలుగుదేశం నాయకులు పూనుకున్నారని ఆయన అన్నారు. ఓ నాయకుడు రైఫిల్‌ను చూపించి రెచ్చగొడితే, మరో నాయకుడు హైదరాబాదు నుంచి 50 బైకులపై గూండాలను కరీంనగర్ తీసుకుని వెళ్లారని ఆయన అన్నారు.

తెలంగాణ సాధిస్తామని చెబుతున్న తెలుగుదేశం తెలంగాణ నాయకులకు ధైర్యం, తెగువ ఉంటే మహానాడులో చంద్రబాబు చేత తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు తాము రాజీనామాలు చేయడానికి సిద్ధమంటూ మిగతా పార్టీలవారు రావాలని షరతు పెడుతున్నారని, తెలంగాణ కోసం త్యాగం చేసేవారు షరతులు పెట్టడమేమిటని, తాము షరతులు పెట్టకుండా రాజీనామా చేశామని ఆయన అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఆ పార్టీ కార్యకర్తలు కూడా విశ్వసించడం లేదని ఆయన అన్నారు. అందుకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికలే నిదర్శమని ఆయన అన్నారు. టిడిపి అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదని ఆయన గుర్తు చేశారు.

చంద్రబాబును ఆయన ఆంధ్రబాబుగా అభివర్ణించారు. చంద్రబాబు దిష్టిబొమ్మను పెట్టుకుంటే తెలంగాణ టిడిపి నాయకులను ఎవరూ నమ్మరని ఆయన అన్నారు. టిడిపి కావాలో, తెలంగాణ కావాలో తెలుగుదేశం తెలంగాణ నాయకులు తేల్చుకోవాలని ఆయన అన్నారు. చంద్రబాబు చెప్పుచేతల్లో ఉన్నంత వరకు తెలంగాణకు చంద్రబాబు గుదిబండ అని ఆయన అన్నారు. వచ్చిన తెలంగాణను చంద్రబాబే అడ్డుకున్నారని తెలుగుదేశం తెలంగాణ నాయకులే అంటున్నారని ఆయన అన్నారు. నాగం జనార్దన్ రెడ్డినే కాదు, తెలంగాణవాదులను ఎవరినైనా తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

English summary
TRS MLA KT Rama Rao terms TDP Telangana leaders as dogs. He said that they can not achieve Telangana with N Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X